కింగ్ సరసన కీర్తి సురేష్?

0

మారిన ట్రెండ్ లో బహుభాషా నటులతో భారీ మల్టీస్టారర్లకు తెరలేచిన సంగతి తెలిసిందే. సౌత్- నార్త్ అలయెన్స్ తో ఈ చిత్రాలు అత్యంత భారీగా తెరకెక్కుతుండడం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం మూడు భాషల స్టార్లతో తెరకెక్కుతున్న టాలీ-బాలీ-మాలీవుడ్ మల్టీస్టారర్ `మరక్కర్-అరబికడలంటే సింహం` దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. జాతీయ స్థాయి ఉత్తమ దర్శకుడు ప్రియదర్శన్ టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.

మోహన్ లాల్ – నాగార్జున- సునీల్ శెట్టి మల్టీస్టారర్ గా చెబుతున్న `మరక్కర్` చిత్రీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. కుంజలి మరక్కర్ అనే నేవీ అధికారి కథ ఆధారంగా రూపొందుతున్న భారీ హిస్టారికల్ వారియర్ చిత్రమిది. మరక్కర్ పాత్రలో లాల్ నటిస్తున్నారు. నాగ్ – సునీల్ శెట్టి – ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ నవంబర్ లో రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇదివరకూ `దేవదాస్` ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి నాగార్జునను ప్రశ్నిస్తే ..ప్రియదర్శన్ సన్నాహకాల్లో ఉన్నారు… తర్వాత వివరాలు తెలుస్తాయి.. అని అన్నారు.

ఇక ఈ చిత్రంలో ముగ్గురు స్టార్ల సరసన నటించే కథానాయికలు ఎవరెవరు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలిగా బహుభాషలకు సుపరిచితమైన మహానటి కీర్తి సురేష్ లీడ్ నాయికగా ఎంపికైందని తెలుస్తోంది. అయితే కీర్తి ఎవరి సరసన నటిస్తుంది? అన్నదానికి సరైన క్లారిటీ లేదు. కీర్తి ఎంపికైంది అనగానే కింగ్ సరసన నటిస్తుందా? అంటూ ఆసక్తికర ముచ్చట సాగుతోంది. అయితే కీర్తి ఓ చైనీ నటుడికి పెయిర్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఇదే చిత్రంతో మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ బాలుడైన మరక్కర్ పాత్రలో కనిపించనున్నాడు. అలానే ప్రియదర్శన్ కుమార్తె – `హలో` బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఓ అతిధి పాత్ర పోషించనుంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా ప్రాణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభు – మేఖేష్ లాంటి సీనియర్ నటులు ఇతర కీలక పాత్రలు పోషించనున్నారు.
Please Read Disclaimer