కీర్తి సురేష్ నెక్స్ట్.. క్రేజీగా ఉందే!

0

హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే ‘మహానటి’ కి ముందు.. తర్వాత అని మాట్లాడుకోవాలి. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది కీర్తి. ఆ సినిమా తర్వాత కీర్తి ఇంతవరకూ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజాగా కీర్తి నెక్స్ట్ సినిమా ప్రకటన వచ్చేసింది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి ఒక సినిమాలో నటిస్తోంది. నగేష్ కుకునూర్ ఇప్పటివరకూ హైదరాబాద్ బ్లూస్.. ఇక్బాల్.. దోర్ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తెలుగువాడే అయినప్పటికీ ఇప్పటివరకూ ఆయన తెలుగు సినిమాకు దర్శకత్వం వహించలేదు. మొదటి సారి ఈ సినిమాతో నగేష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి.. జగపతి బాబు.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు. తను వెడ్స్ మను ఫేం చిరంతాన్ దాస్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సుధీర్ చంద్ర.. శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభం అయిందట. ఈ చిత్రాన్ని వికారాబాద్.. పూణే లో షూటింగ్ జరుపుతున్నారట. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘మహానటి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ ఫైనల్ గా కీర్తి ఒక క్రేజీ తెలుగు ఫిలిం సైన్ చేసింది కదా?
Please Read Disclaimer