ఏపీకి స్పెషల్ స్టేటస్ .. కేజ్రీవాల్ సపోర్ట్

0విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీలో పోరుబాట పట్టి తెలుగుదేశం ఎంపీలకు కేజ్రీవాల్‌ మద్దతు ప్రకటించారు.

కాగా ఈ రోజు ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన ఎంపీలు.. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్‌ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.