బన్నీకి తిత్తి తీశారు ఫ్యాన్స్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. దేశ – విదేశాల్లో మెగాస్టార్- స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సంఘాలు సేవలు చేస్తున్నాయి. ఆలిండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగుల్లో ప్రత్యేకించి మెగా హీరోలకు ఎలా ప్రమోషన్స్ చేయాలి? అన్నదానిపైనా ఆసక్తికర డిబేట్ జరుగుతుంటుంది. అదంతా అటుంచితే మెగాస్టార్ స్ఫూర్తితో మెగా కాంపౌండ్ నుంచి తనంతట తానే స్వయంకృషితో ఎదుగుతున్న హీరోగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది.

మెగాస్టార్ అనే వటవృక్షం కింద పిల్ల ఏరులా మొదలై ప్రభంజనంలా రూపాంతరం చెందాడు బన్ని. స్టైలిష్ స్టార్ గా అతడిని ప్రేక్షకాభిమానులు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరకే ఈ ఫాలోయింగ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇతర రాష్ట్రాల్లో అంతకుమించి అన్న చందంగా ఉంది సన్నివేశం. అటు కేరళలో అయితే అసాధారణంగా అభిమానధనం పోగేసుకున్నాడు అల్లూవారబ్బాయ్.

ఇదిగో ఈ గుంపును చూడండి. అతడి లెవలెంతో అర్థమవుతోంది. గాడ్స్ వోన్ కంట్రీ కేరళలో ఫ్యాన్స్ ఎలా ఇరగబడ్డారో. కొచ్చి ఎయిర్ పోర్ట్ లో విమానం నుంచి ఇలా దిగాడో లేదో అలా ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. తమ అభిమాన హీరో ఆటోగ్రాఫ్ – ఫోటోగ్రాఫీ – సెల్ఫీల కోసం మీద పడి నానా రచ్చ చేశారు. “వెల్ కం బ్యాక్ టు మల్లూ అర్జున్ ఫర్ గాడ్స్ వోన్ కంట్రీ` అంటూ బ్యానర్లు దర్శనమిచ్చాయి అక్కడ. ఓ మైగాడ్ ఇంత పాలోయింగా? అనేంత రేంజులో విమానాశ్రయంలో రచ్చ సాగిందని ఆ సన్నివేశం చెబుతోంది. ఇటీవలే వరదల్లో కేరళ మునిగిపోయినప్పుడు వెంటనే స్పందించి రూ.25లక్షల డొనేషన్ ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు బన్ని. మోహన్ లాల్ – మమ్ముట్టి అంతటి స్టార్లకే ఆ ప్రకటన తర్వాత చెమటలు పట్టాయంటే అతిశయోక్తి కాదు. ఇదొక్కటే కాదు.. అసలు బన్ని సినిమాలొస్తున్నాయంటేనే మల్లూ స్టార్లు ఒణకుతారు. తమ సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకునేందుకైనా వెనకాడరు. ఇప్పుడు కేరళలో జరుగుతున్న నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కి బన్ని ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఏకంగా కేరళ ప్రభుత్వమే అతడిని ఆహ్వానించి గౌరవిస్తోంది. దటీజ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నమాట!!
Please Read Disclaimer