సబ్ కలెక్టర్ తో ఎమ్మెల్యే ప్రేమ వివాహం

0mla-marry-ias-officerకేర‌ళ‌లో ఎమ్మెల్యేతో సబ్ కలెక్టర్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని అరువిక్క‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్, తాను తిరువ‌నంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య అయ్యర్ ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డించారు. ఈ మేరకు శబరినాథన్ తామిద్దరూ క‌లిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన ప్రేమ గురించి ఆయన వివరించారు.

తిరువ‌నంత‌పురంలో మొద‌టిసారి దివ్య‌ను క‌లిశాన‌ని, అప్పుడే త‌మ ఇద్ద‌రి ఆలోచ‌న‌లు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలోనే త‌న మ‌న‌సులో మాట‌ను దివ్య‌తో చెప్పాన‌ని ఎమ్మెల్యే శబరినాథన్ పేర్కొన్నారు. తమ పెళ్లికి రెండు కుటుంబాలు కూడా ప‌చ్చజెండా ఊపాయని, త్వరలోనే స‌బ్ క‌లెక్ట‌ర్ ను వివాహమాడనున్నానని ఆయన చెప్పారు.

కేరళ మాజీ స్పీకర్ కుమారుడైన శబరినాథన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్… తండ్రి మ‌రణానంత‌రం రాజకీయాల్లోకి వ‌చ్చారు. తిరువ‌నంత‌పురంలోని అరువిక్క‌ర నియోక‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరపున 2015లో పోటీ చేసి గెలిచారు.

స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య…2016 ఎన్నిక‌ల సంద‌ర్భంగా విధుల్లో భాగంగా ఒక ప్రచార వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో పాటను రాసి, ఆలపించింది కూడా ఆమె కావడంతో…ఆ వీడియో కేర‌ళలో దివ్య అయ్యర్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.