100 కోట్ల మార్క్ అందుకున్న ఖైదీ

0Khaidi-song-stillఓపెనింగ్ డే కలెక్షన్స్ నుండి ఫస్ట్ డే, సెకండ్ డే అంటూ పలు రకాల రికార్డుల్ని సరికొత్తగా సృష్టిస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ తాజాగా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. మొత్తం 5 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 106 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో బాహుబలి తరువాత అంతటి వేగవంతమైన కలెక్షన్లు సాదించిన రెండవ తెలుగు చిత్రంగా ఖైదీ నిలిచింది.

ఈ విషయమై పలువురు ట్రేడ్ అనలిస్టులు ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 9 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రావడం, సినిమా బి, సి సెంటర్ ఆడియన్సుకి విపరీతంగా నచ్చడం, మెగాస్టార్ కూడా అభిమానుల అంచనాలను మించి పెర్ఫార్మ్ చేయడంతో సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే జరిగిన బిజినెస్ చూస్తే మరో వారం పది రోజుల్లో అన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్లు అసలు మొత్తం రాబట్టుకొని లాభాల్లోకి వెళ్లనున్నారు. ఇకపోతే యూఎస్ లో సైతం ఖైదీ 2 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టేశాడు.