సంచలనం సృష్టిస్తున్న ఖైదీ కలెక్షన్స్

0khaidi-no-150-storms-into-the-2-million-clubవిడుదలైన తొలి రోజు నుంచి రికార్డుల మోత మోగిస్తూ సాగుతోంది మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. తొలి రోజు వసూళ్లలోనే అలవోకగా నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్.. ఫస్ట్ వీక్ వసూళ్లలోనూ రికార్డులు బద్దలు కొడుతూ సాగింది. ఫస్ట్ వీక్ వసూళ్లలో చాలాచోట్ల ‘బాహుబలి’ రికార్డుల్ని కూడా దాటేసింది ‘ఖైదీ నెంబర్ 150’. ఐతే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ వల్ల ఫస్ వీక్ బాహుబలి కలెక్షన్లను దాటగలిగింది కానీ.. ఆ సినిమా ఫుల్ రన్ వసూళ్లను మాత్రం దాటడం కష్టమే అనుకున్నారంతా. కానీ వైజాగ్ ఏరియాలో ఆ రికార్డును కూడా కొల్లగొట్టేసి సంచలనం సృష్టించింది చిరు సినిమా.

వైజాగ్ ఏరియాలో ‘బాహుబలి’ రూ.9.52 కోట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా.. పదో రోజుకే ఆ మార్కును దాటేసింది చిరు సినిమా. ఈ ఏరియాలో తొలి రూ.10 కోట్ల షేర్ మూవీగానూ ‘ఖైదీ నెంబర్ 150’ చరిత్ర సృష్టించడం ఖాయమని తేలిపోయింది. బాహుబలి-2 వచ్చే వరకు బాహుబలి-1 రికార్డును ఇంక సినిమా కూడా టచ్ చేయలేదని.. బాహుబలి రికార్డులు ఎప్పటికీ చెక్కు చెదరవని అంతా అనుకున్నారు. కానీ తనకు తిరుగులేని పట్టున్న వైజాగ్ ఏరియాలో చిరు అనితర సాధ్యమైన కలెక్షన్లతో అద్భుతమైన రికార్డును ఖాతాలో వేసుకున్నారు. ఇంకా రెండు మూడు ఏరియాల్లో ‘బాహుబలి’ ఫుల్ రన్ కలెక్షన్లకు ‘ఖైదీ నెంబర్ 150’ చేరువగా ఉంది. ఈ వీకెండ్లో పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి అక్కడ కూడా రికార్డులు బద్దలవుతాయా లేదా అన్నది తేలుతుంది.