ఖైదీ నెం 150 సినిమా డిలీటెడ్ సీన్స్

0మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రానికి సంబంధించి ఎడిటింగులో లేపేసిన సీన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి, కాజల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కు సంబంధించిన ఓ సీన్ యూట్యూబ్ ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

తాజాగా బ్రహ్మానందం, అలీ మధ్య జరిగే కామెడీకి సంబంధించి డిలీట్ చేసిన ఓ సీన్ రిలీజ్ చేసారు. ఈ డిలీటెడ్ సీన్లను మెగా అభిమానులు తెగ చూస్తున్నారు.

బ్రహ్మీ: ఇల్లీగల్ గా 20 మంది

నీకు ఇద్దరు పెళ్లాలున్నారా? అని అలీ ఆశ్చర్య పోవడం, వీరు తగలక ముందు లీగల్ గా ఇద్దరే, ఇల్లీగల్ గా 20 మంది ఉండే వారు… పర్సున్నోడికి పర్సనాలిటీ అక్కర్లేదు అంటూ బ్రహ్మీ సమాధానం చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు.

మెగాస్టార్: సిగ్గు మొగ్గేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వేరియేషన్ అయినా అద్భుతంగా పండించగలరు. తాజాగా రిలీజ్ చేసిన డిలేడెట్ సీన్లో మెగాస్టార్ సిగ్గుపడే సీన్ సూపర్భ్ అనేలా ఉంది. అఫ్ కోర్స్ సిగ్గుపడే సీన్ పండించడంలో ఆయన్ను మించిన యాక్టర్ టాలీవుడ్లో లేరనుకోండి!

ఖైదీ నెం 150 చిత్రానికి సంబంధించి మరిన్ని డిలెటెడ్ సీన్లు వరుస పెట్టి రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాలో ఎడిటింగ్‌లో మిస్సయిన సీన్లు అభిమానులకు కనువిందు చేయబోతున్నాయన్నమాట.