ఖైదీ నెం 150 రాజమౌళి రివ్యూ

0khaidi-no-150-rajamouli-reviewఏదైనా మంచి సినిమా వచ్చిందంటే.. ఆ సినిమాను తనంతట తానే ప్రమోట్‌ చేస్తుంటాడు దర్శకుడు రాజమౌళి. ఆ సినిమా యూనిట్‌ను ప్రశంసిస్తూ మినీ రివ్యూ కూడా రాస్తుంటాడు. బుధవారం విడుదలైన మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’ గురించి కూడా జక్కన్న తనదైన శైలిలో స్పందించాడు. బుధవారం ఉదయమే 8:45 గంటల షో చూసి ట్విట్టర్‌లో తన రివ్యూ రాశాడు.
 
 
‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌. చిరంజీవిగారూ వెనక్కి వచ్చేసినందుకు ధన్యవాదాలు. పదేళ్ళుగా మిమ్మల్ని చాలా మిస్సయిపోయాం. రికార్డ్‌ బ్రేకింగ్‌ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేసిన చరణ్‌కు కంగ్రాట్స్‌. దర్శకుడు వినయ్‌గారు కుమ్మేశారంతే.. ఆయనకంటే ఈ సినిమాను బెటర్‌గా ఎవరూ తీయలేరు. ఖైదీ టీమ్‌.. హ్యావ్‌ ఏ బ్లాస్ట్‌’ అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు.