శ్రీదేవి కూతురు బికినీ పోజు!

0ఒకవైపు అంతా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమా ఎంట్రీ గురించి మాట్లాడుకుంటుంటే, మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ వార్తల్లోకి వచ్చింది. అదికూడా గ్లామర్ షోతో ఈమె వార్తల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఖుషీకపూర్ బికినీ పిక్చర్ సర్క్యులేట్ అవుతోంది. సముద్రతీరంలో ఖుషీ దిగిన ఫొటో ఇది.

ఈ ఫొటోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఈ ఫొటోను చూసి ఖుషీ లవ్ అండ్ అడ్మిరేషన్ ను కురిపిస్తుంటే, మరికొందరు దీన్ని స్కిన్ షో అని అంటున్నారు. ఇంకొందరేమో శ్రీదేవి చిన్న కూతురులో కూడా హీరోయిన్ ఫీచర్లున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా పరిచయం అయితే.. ఖుషీ కూడా తన గ్లామర్ తో మంచి గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

ముందు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యి నిలదొక్కకుంటే.. ఆ తర్వాత ఖుషీ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.Kushi-Kappor-Bikini