‘బాహుబలి’ ని తిట్టి..ఇప్పుడు మళ్లీ ‘శ్రీమంతుడు’కి రివ్యూ

0బాహుబలి’ చిత్రాన్ని రిలీజ్ కు ముందే దాదాపు తిట్టినంత పనిచేస్తూ రివ్యూ ఇచ్చిన కైరా సాధుని ఎవరూ మర్చిపోరు. ట్విట్టర్ వేదికగా ఆమె రెచ్చిపోయి ఇచ్చిన ఆ రివ్యూ అప్పుడు సంచలనమైంది. ఇప్పుడు ఆమె దృష్టి శ్రీమంతుడుపై పడింది. అయితే ఈ సారి రివర్స్ లో శ్రీమంతుడు చిత్రాన్ని ఆమె 5 రేటింగ్ ఇచ్చి పొగడ్తల్లో ముంచెత్తింది. ఆమె ఏం ట్వీట్ చేసిందో ఈ సారి ఈ క్రింద చూడండి..

kiara-sandhu

దర్శకుడు మాట్లాడుతూ ”మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య… ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు” అన్నారు.
జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,

కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.