పెళ్లికి ముందు సెక్స్.. తప్పేముంది..కియారా అద్వానీ

0కియారా అద్వానీ.. ఎం ఎస్ ధోని సినిమాతో తెలుగువారిని పలకరించిన ఈమె మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో అందరి ఆదరణను పొందింది. ఇందులో ముఖ్యమంత్రి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన ఈమె లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ కారెక్టర్ చేసిన సంగతి మనకి తెలుసు. ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో కొన్ని బోల్డ్ కామెంట్లు చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ భామ.

నలుగురు దర్శకులు తీసిన నాలుగు కథలతో ఒక వెబ్ ఫిల్మ్ గా మారిన ‘లస్ట్ స్టోరీస్’ లో కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన కథలో ముఖ్యపాత్ర పోషించింది కియారా. ఒక ఇంటర్వ్యూలో తనకు మంచి సువాసన వచ్చే అబ్బాయిలు నచ్చుతారు అని చెప్పిన ఈమె సెక్స్ పై తనకున్న అభిప్రాయాలు కూడా వెలిబుచ్చింది. “సెక్స్ తప్పుకాదు దాని గురించి నెమ్మదిగా ఎవరికి వినపడకుండా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు 15 ఏళ్ల వయసులో తెలిసిన విషయం ఏంటంటే సెక్స్ పెళ్లి అయ్యాక మాత్రమే చేయాలని. ఎందుకో నాకు అర్థంకాదు. నా దృష్టిలో అది తప్పు” అంటూ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.

అటు తెలుగు ప్రేక్షకులను ఇటు నార్త్ ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్ లో పైకి ఎదిగిపోతోంది కియారా. తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు కొట్టేస్తోంది. మహేష్ బాబు తర్వాత ఇప్పుడు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జతకట్టబోతోంది. అటు హిందీలో కూడా కొన్ని పెద్ద సినిమా ఆఫర్లనే బుట్టలో వేసినట్టు తెలుస్తోంది.