పార్టీ ఉంటే చాలు.. కియరాకి రెక్కలు!!

0

పార్టీకి పిలవడం ఆలస్యం.. పరుగెత్తుకొచ్చేస్తోంది ఈ బేబి. ముంబైలో ఎక్కడ ఏ పార్టీ జరిగినా క్షణాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోతోంది. క్లబ్బు – పబ్బు – లాంజ్ – ఔట్ డోర్ ఎక్కడ సెలబ్రేషన్ జరిగినా – బర్త్ డే – వెడ్డింగ్ డే అంటూ ఏ సెలబ్ ఈవెంట్ జరిగినా అక్కడ నేనున్నానంటూ దిగిపోతోంది. ఇక ముంబై నగరంలో ఎ ఫ్యాషన్ షో చూసినా కియరా కువకుకవలే.

అటు బాలీవుడ్ – ఇటు టాలీవుడ్ రెండు చోట్లా కెరీర్ పరగులు పెడుతోంది. ఇరు పరిశ్రమల్లో ఆరంభమే గోల్డెన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుని వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. ఎంఎస్ ధోని – భరత్ అనే నేను చిత్రాలు సంచలన విజయం సాధించడం కియరా దూకుడుకు అసలు కారణం. అటుపై నటించేవి అన్నీ అగ్రకథానాయకుల సినిమాలే. ఆ క్రమంలోనే కియరా స్పీడు మిసైల్ వేగాన్ని మించిపోతోందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో మహేష్ భార్యామణి నమ్రత తనకు స్నేహితురాలు కావడంతో ఇక్కడ ఎదురే లేదు. అటు బాలీవుడ్ లోనూ తిరుగులేని పీఆర్ ని మెయింటెయిన్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా జూలీ నేహా ధూపియా సీమంతం ఈవెంట్ లోనూ కియరా సందడి మామూలుగా లేదు. ఈ ఈవెంట్ కి ది బెస్ట్ సెలబ్రిటీస్ ఎటెండ్ అయ్యారు. కరీనాకపూర్ ఖాన్ – సోహా అలీఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో ఆద్యంతం కియరా వన్నెచిన్నెలే దర్శనమిచ్చాయి. కీ.శే శ్రీదేవి భర్త బోనీకపూర్ – కుమార్తె జాన్వీ – కరణ్ జోహర్ – సోనాక్షి – హ్యూమా ఖురేషి తదితరులు హాజరయ్యారు. నేహాధూపియా జూలీ – పరమవీరచక్ర(బాలయ్య) సినిమాలతో తెలుగువారికి సుపరిచితం. నటుడు అంగద్ బేడీని పెళ్లాడిన నేహా బేబి బంప్ షో ఇదివరకూ చర్చకొచ్చింది. ఇప్పుడు సీమంతం వేడుకతో మరోసారి చర్చల్లోకొచ్చింది.
Please Read Disclaimer