చిట్టిబాబు చిలిపి అంటున్న కియారా అద్వాని!

0బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. తన మొదటి తెలుగు సినిమాతోనే ఆడియన్స్ ను – ఫిలిం మేకర్స్ ను మెప్పించిన కియారాకు ఇప్పుడు చేతిలో ఆఫర్లు ఫుల్లుగా అన్నాయి. అందులో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC12 ఒకటి.

మరి ఈ సినిమాలో చరణ్ తో నటించడం ఎలా ఉంది అని కియారాను అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. షూటింగ్ లొకేషన్ లో ఫుల్ ఫన్ గా ఉంటుందని చరణ్ చిలిపి పనులు చేస్తుంటాడని చెప్పింది. షూటింగ్ లొకేషన్ కు చరణ్ ఎనర్జీ – పాజిటివిటీ వచ్చేలా చేస్తాడని చెప్పింది. చరణ్ ఒక అమేజింగ్ కో-స్టార్ అని కితాబిచ్చింది. అంతటితో ఆపలేదు కీయరా.. చరణ్ పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో అణకువతో ఉంటాడని రోజంతా యాక్టివ్ గా ఉంటాడని చెప్పింది.

చరణ్ కు సంబంధించి మిగతావన్నీ అందరికీ తెలిసినవే గానీ ఈ చిలిపి చిట్టి బాబు యాంగిల్ మాత్రం ఎదో కొత్తగా అనిపిస్తోంది. మరి ఆ లస్ట్ భామ చేత చిలిపి అనిపించేలా ఏం చేశాడో మాత్రం చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టింది.. ఎంతైనా బొంబాయి పిల్ల కదా!