నా పేరు అది కాదంటున్న మహేష్ హీరోయిన్

0

మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కియార అద్వానీ. మొదటి సినిమా విడుదలకు ముందే రామ్ చరణ్ తో రెండవ సినిమా ఛాన్స్ దక్కించుకుంది. అయితే భరత్ అనే నేను సూపర్ హిట్ అవ్వగా వినయ విధేయ రామ చిత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో ఈమెకు మంచి పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈమె మాత్రం బాలీవుడ్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ సమయంలోనే ఈముద్దుగుమ్మ తన పేరును కొందరు తప్పుగా పలకడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఎక్కువ శాతం మంది ఈమెను కైరా అద్వానీ అంటూ సంభోదిస్తారు రాసే సమయంలో కూడా కైరా అంటూ రాస్తున్నారు. తాజాగా ముంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమెను కార్యక్రమ హోస్ట్ కైరా అద్వానీ అంటూ పిలవడంతో తనను కైరా కాదు కియార అంటూ పిలవాలంటూ కోరిందట. తన పేరు కైరా కాదని కియార అద్వానీ అంటూ చెప్పుకొచ్చింది. ఇకపై అంతా కూడా తనను కియార అని పిలవాలని కైరా కాదు అంటూ కోరడం జరిగింది.

ప్రస్తుతం ఈమె అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ చిత్రంతో పాటు ఇంకా అక్షయ్ కుమార్ తో లారెన్స్ రూపొందించబోతున్న ‘కాంచన’ రీమేక్ లో కూడా ఈమె ఎంపిక అయ్యింది. కాంచన రీమేక్ కాకుండా అక్షయ్ కుమార్ తో మరో సినిమాను కూడా ఈ అమ్మడు కమిట్ అయ్యింది. బాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్న ఈమె సౌత్ లో అవకాశాలు వచ్చినా తప్పకుండా చేస్తానంటోంది.
Please Read Disclaimer