సీఎం భరత్ లవర్ కేకో కేక

0బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న కియారా అద్వానీ ఈమద్యే తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఈ అమ్మడు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్ గా నటించి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను దక్కించుకుంది. ఆ వెంటనే రెండవ చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించే అవకాశంను దక్కించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో కూడా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తుంది.

ఈమద్య హిందీలో ఈమె చేసిన ఒక వెబ్ సిరీస్ చర్చనీయాంశం అయ్యింది. ఆ వెబ్ సిరీస్ లో భర్త నుండి సుఖం పొందని గృహిణిగా కియారా నటించి మెప్పించింది. ఎలాంటి బోల్డ్ పాత్రలకైనా ఓకే చెబుతూ వస్తుంది. హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు దక్కుతున్నా కూడా ఈమె మోడల్గా కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా లక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఎల్లోరా శిల్పం నడిసి వస్తున్నట్లుగా కియారా అద్వానీ అందంతో ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం కియారా అద్వానీ ఫ్యాషన్ వీక్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమాల్లోనే కాకుండా ఇలా ఫ్యాషన్ షోల్లో కూడా తన అందంతో అలరిస్తూ వస్తున్న కియారా అద్వానీ హాట్ ఫొటోపై మీరు ఒక లుక్కేయండి.