ముంబై ర్యాంప్ ని ఉతికి ఆరేసింది!

0ముంబైని మొన్నటి వరకూ వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం కియరా పవనాలు విజృంభిస్తున్నాయి. ఈ వర్షం వరదై – సునామీ అయ్యి ముంబైని ముంచెత్తబోతోందని తాజా సన్నివేశం చెబుతోంది. అసలింతకీ ఏమైంది.. అంటారా? అదేనండీ.. మన కియరా.. మన ఆన్ స్క్రీన్ సీఎం భరత్ గాళ్ ఫ్రెండ్ ముంబైని షేక్ చేస్తోంది. అక్కడ ఏ ఫ్యాషన్ షోలో చూసినా – ఎక్కడ ర్యాంప్ వాక్ చూసినా ఈ అమ్మడే. ప్రతిచోటా స్టేజీ షేక్ షేక్ బాబోయ్ అంటోంది!

ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ ఈ అమ్మడిలో కాన్ఫిడెన్స్ లెవల్ ని ఆ రేంజుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు. `భరత్ అనే నేను`తో టాలీవుడ్ లో – `ఎం.ఎస్.ధోని` చిత్రంతో బాలీవుడ్ లో హిట్లు అందుకుంది. ఆ లెవల్ ఇప్పుడు చూపిస్తోంది కియరా. ఇన్నేళ్లలో ఇంతమంది స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో సందడి చేశారు. గోవా బ్యూటీ ఇలియానా నుంచి ముంబై బొమ్మ పూజా హెగ్డే వరకూ చాలా మంది భామలే ఇక్కడ దిగారు కానీ వీళ్లందరిలోకి కియరా అద్వాణీ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ముంబైలో ప్రస్తుతం ఏ చోట చూసినా ఈ అమ్మడి హవానే కనిపిస్తోంది. ప్రస్తుతం కియరా అద్వాణీ మోడలింగ్ అసైన్ మెంట్స్ యూట్యూబ్ – సామాజిక మాధ్యమాల్లో ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రేంజులో ఉప్పెన వేరొక కథానాయిక విషయంలో సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు.

ముంబైలో కియరా ప్రకంపనాల గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. భరత్ ఇచ్చిన కాన్ఫిడెన్సు – అటుపై చరణ్తో ఛాన్స్.. ఇప్పుడు తమిళ్ లో ధనుష్ తో ఆఫర్.. అటు బాలీవుడ్ లో అక్షయ్ క్రేజీ మల్టీస్టారర్ లో గోల్డెన్ ఛాన్స్.. మునుముందు ఇంకా ఇంకా .. కరణ్ జోహార్ లాంటి దిగ్గజాలే కియరాని వెనకేసుకొస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. అవకాశాలతో వచ్చే గ్లింప్స్కి ఇదో ఎగ్జాంపుల్. ఇకపోతే టాలీవుడ్ లో నమ్రత తనకు గాడ్ ఫాదర్. బాలీవుడ్ లో కరణ్ అంతటివాడే ఉన్నాడు. అందుకేనా ఇలా.. ఈ రేంజులో! గ్గాడ్! ర్యాంప్ షోలతోనే కాదు.. ఇకమీదట ఇతర స్టార్ హీరోయిన్లతో పోటీపడుతూ బాలీవుడ్ ని దున్నేయడం ఖాయంలానే కనిపిస్తోంది. ఈ హరికేన్ ని కియరా హరికేన్ అని డిఫైన్ చేయాలి.