ప్రభాస్ కు సీక్రెట్ మెసేజ్ పెట్టిన భామ

0Kiara-Advaniపోతేపోయింది నాలుగేళ్ల కాలం.. జీవితం మొత్తానికి చెప్పుకునే అద్భుతమైన బాహుబలి సినిమా చాన్స్ కొట్టేశాడు మా డార్లింగ్ అంటూ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పుకోవటం ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తోంది. ఒక సినిమా కోసం ఒక హీరో.. సుదీర్ఘకాలాన్ని త్యాగం చేయటం అంత చిన్న విషయం కాదు. దీనికి తగ్గట్లే ప్రభాస్ ఇమేజ్ ఆకాశమంత ఎదిగిపోయింది. ఇప్పుడాయన ఇండియా మొత్తానికి సుపరిచితులుగా మారారు. చివరకు హాలీవుడ్ లోనూ ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసిన పరిస్థితి.

డార్లింగ్ అంటూ అందరూ ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీనేజ్ అమ్మాయి నుంచి.. ఏజ్కు అతీతంగా అందరూ అమితంగా అభిమానించే ఈ సూపర్ హీరోకి.. తాజాగా హీరోయిన్స్ కూడా ప్లాట్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ ప్రభాస్ తో మాట్లాడేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ భామ ఎవరో కాదు.. ధోనీ సినిమాలో నటించిన కైరా అద్వానీ. ప్రభాస్ ను అమితంగా ఇష్టపడే ఆమె.. అతడ్ని కలిసేందుకు చాలానే ప్రయత్నించిందట. కానీ.. సాధ్యం కాలేదట. తాజాగా టాలీవుడ్కు చెందిన ఒక హీరో నుంచి ప్రభాస్ ఫోన్ నెంబరును తీసుకున్న ఆమె.. ఒక సీక్రెట్ మెసేజ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. దీనికి డార్లింగ్ కూడా రియాక్ట్ అయి.. రిప్లై ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ సీక్రెట్ మెసేజ్ల్లోని కంటెంట్ మాత్రం బయటకు రాలేదు. మరి.. ఇద్దరి మధ్య సాగిన మెసేజ్లు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.