షాకిచ్చిన అపరిచితుడు

0

స్టార్ హీరో సినిమా ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుంది? ఏదో ఒక అందమైన లేదా స్టైలిష్ డ్రెస్ లో ఉన్నహీరో గెటప్ ను రివీల్ చేస్తారు. కానీ అందరిలా ఉంటే విక్రమ్ స్పెషాలిటీ ఏముంది? అందుకే ‘అపరిచితుడు’ సినిమాలో అపరిచితుడు పాత్ర స్టైల్ లో ఒక విభిన్న గెటప్ తో వచ్చాడు. సినిమా పేరు ‘కదరం కొండన్’.

ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే మనకొక ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. కమల్ చేయాల్సిన సినిమాను విక్రమ్ తో చేస్తున్నారా అని. ఎందుకంటే.. ఈ సినిమాను కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇక కమల్ కు ఆస్థాన సంగీతదర్శకుడిగా మారిన జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేష్ ఎమ్. సెల్వ ఈ సినిమాకు దర్శకుడు.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంది అంటే.. విక్రమ్ మళ్ళీ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు ఆని మనం డిసైడ్ అయిపోవచ్చు. షర్ట్ లేకుండా కండలు తిరిగిన దేహంతో చేతికి సంకెళ్ళు. అయినా కూల్ గా అదేమీ లేనట్టు ఒక మెజీషియన్ లాగా చేతులని అబ్రకాదబ్రా అన్నట్టుగా పోజ్ ఇచ్చాడు. మొహీకన్ హెయిర్ స్టైల్.. ఒంటి నిండా పచ్చబొట్లు..అల్ట్రా స్టైలిష్ మీసం గెడ్డం గెటప్. వీటికి తోడు కూలింగ్ గ్లాసెస్. నోటిలోనుంచి పొగ వస్తున్నట్టుగా ఉంది. కాన్సెప్ట్ ఏంటో అర్థం కాకపోయినా ఇదో స్పెషల్ సినిమా.. రెగ్యులర్ కాదు అని మాత్రం హింట్ ఇచ్చేసింది.
Please Read Disclaimer