భర్త వదిలేశాడు, ఇబ్బందుల్లో నటి

0kim-sharma-ali-punjani-phot‘ముసుగు వేయొద్దు మనస్సు మీద.. వలలు వేయొద్దు వయస్సు మీద’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో అలరించిన కిమ్‌ శర్మ గుర్తుంది కదా.. ఇప్పుడు ఈ నటి కష్టాల్లో ఉందట. 2010లో బిజినెస్‌ టైకూన్‌ అలీ పంజనీని పెళ్లి చేసుకున్న కిమ్‌ శర్మ భర్తతోపాటు కెన్యాకు వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె ఒంటరిగా ముంబైకి తిరిగి రావడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. కిమ్‌ భర్త మరో మహిళను ఇష్టపడుతుండటంతో ఆమె పెళ్లి బంధం ముగిసిపోయిందని సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.

‘మరో మహిళకు ఆకర్షితుడైన అలీ కిమ్‌ను వదిలేశాడు. విడ్డూరమేమిటంటే కిమ్‌ను కలిసినప్పుడు అలీ పెద్దగా అట్రాక్టివ్‌గా ఉండేవాడు కాదు. కానీ ఆమె కోసం బరువు తగ్గి ఫిట్‌ తయారయ్యాడు. ఇప్పుడు మరో మహిళ మోజులో అతను కిమ్‌ను వదిలేశాడు. కనీసం డబ్బు ఇవ్వడం కానీ, ఆర్థిక భద్రత కల్పించడం కానీ చేయలేదు. దీంతో ముంబైలో సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. తన పేరును కిమి శర్మ (అసలు పేరు ఇదే)గా మార్చుకొని బ్రాండ్‌ స్ట్రాటజిస్టుగా కొనసాగాలనుకుంటోంది. కెన్యాలోని తమ ఇంటిని వీడిరావడమే కాకుండా పంజనీ హోటల్స్‌ సీఈవో పదవి నుంచి కూడా ఆమె తప్పుకుంది’ అని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే, ఆమె ముంబైకి తిరిగి వచ్చినప్పటి నుంచి మెన్స్‌వేర్‌ డిజైనర్‌ అర్జున్‌ ఖన్నాతో సన్నిహితంగా మెలుగుతుండటం గమనార్హం. వీరిద్దరు కలిసి ఇటీవల పలుసార్లు ఫొటోలకు పోజు కూడా ఇచ్చారు. కిమ్‌ శర్మ రాకతో అర్జున్‌-షెఫీలా దంపతుల మధ్య విభేదాలు వచ్చాయట. తన భర్త కిమ్‌కు దగ్గరవ్వడంతో షెఫీలా భర్తకు దూరంగా వేరుగా ఉంటున్నదని తెలుస్తోంది.