భర్త చేసిన వంచనకు.. కిమ్ అంతా ఉచితంగానే..

0kim-sharma-hotఅందాల తార కిమ్ శర్మ గురించి చెప్పుకుంటే సినిమాను మించిన విషాద కథ. కెరీర్ మంచి జోష్‌లో ఉండగా కెన్యా పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని వెండితెరపై నుంచి కనుమరుగైపోయింది. ఆ తర్వాత భర్త మరో యువతితో సంబంధం పెట్టుకొని కిమ్ శర్మను దారుణంగా వంచించాడు. పైసా చేతిలో పెట్టకుండా ఇంటి నుంచి తరిమేశాడు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న కిమ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నట్టు సమాచారం. మళ్లీ సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేపట్టింది.

కెరీర్ మంచి ఉన్నత స్థితిలో ఉండగా 2010లో కెన్యా పారిశ్రామికవేత్త అలి పుంజానీని వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత అలీ పుంజానీ చేసిన మోసంతో ఆయనకు దూరమైంది. 2017 ఏప్రిల్ భర్త పుంజానీ నుంచి విడాకులు తీసుకొని ముంబైలో జీవనం సాగిస్తున్నది.

ముంబైలో నివసిస్తున్న కిమ్ శర్మ స్వచ్చంద సంస్థ కోసం పనిచేస్తున్నది. ప్రముఖ నటుడు జావెద్ జాఫ్రీ స్థాపించిన స్వచ్ఛంద సంస్థతో కిమ్ భాగస్వామ్యమైంది. ఇండియన్ డాక్యుమెంటరీ ఫౌండేసన్ ప్రొగ్రాం గుడ్ పిచ్ ఇండియా కోసం ఉచితంగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఓ వైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తునే గుడ్ పిచ్ ఇండియా కోసం తీసే ప్రమోషన్ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నది. ఆ సంస్థ తీసే యాడ్ ఫిల్మ్‌లో నటిస్తున్నది. గుడ్ పిచ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కావడంతో రెమ్యునరేషన్‌తో కాకుండా ఉచితంగా సేవలు అందిస్తున్నది.

కెన్యా నుంచి గడ్డుస్థితిలో ముంబై చేరుకొన్న తర్వాత తన చిరకాల మిత్రుడు అర్జున్ ఖన్నాతో కలిసి సహజీవనం చేస్తున్నది. గత కొద్దికాలంగా భార్య షిఫాలీకి దూరంగా ఉంటున్న ఆయన కిమ్‌తో సంబంధం పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. అర్జున్ ఖాన్నానే జావెద్ జాఫ్రీకి పరిచయం చేసినట్టు సమాచారం.

యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు.. అలీ పుంజానీతో పెళ్లికి ముందు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. దాదాపు వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వచ్చింది. అయితే వారిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కిమ్ శర్మతో పెళ్లికి యువరాజ్ సింగ్ తల్లి విలన్‌గా మారినట్టు వార్తలు కూడా వచ్చాయి.

ఖడ్గం, మగధీర చిత్రాల్లో.. బాలీవుడ్‌లో ప్రవేశించకముందు తొలిసారి క్లోజప్ టూత్ పేస్ట్‌కు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత బిజీగా మారిన ఆమె సన్ సిల్క్, పెప్సీ, టాటా సఫారీ, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్ అండ్ క్లీన్, లిరిల్ వ్యాపార ప్రకటనలో కనిపించింది. 1993లో డర్ చిత్రంలో చిన్నపాత్రతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆదిత్య చోప్రా రూపొందించిన మొహబ్బతే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఖడ్గం, అంజనేయులు, మగధీర చిత్రాల్లో కనిపించింది.