జబర్దస్త్ కమెడియన్ తో లిప్ లాకా?

0Kiraak-RP-Lip-lock-with-Ruchi-in-Idem-Dayyam-movieస్టోరీ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లు చేయడానికి సిద్ధమే… కొత్తగా సినిమాల్లో పైకొస్తున్న.. ఫాంలో పెద్దగా లేని హీరోయిన్లు సాధారణంగా చెప్పే డైలాగిది. బాలీవుడ్ సినిమాల్లో ఈ అధర చుంబనాలు కాస్త ఎక్కువగానే ఉన్నా తెలుగులో మాత్రం ఇంకా కాస్త తక్కువగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు లిప్ లాక్ సీన్లకు ఎస్ అంటున్నారు. సినిమా రిలీజ్ ముందు బజ్ ఏర్పడటానికి ఈ సీన్లు బాగానే ఉపయోగపడుతున్నాయి.

హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు పెట్టడం కామన్ అయిపోతున్న టైంలో కమెడియన్ కు హీరోయిన్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం విశేషం. జబర్దస్త్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన కిరాక్ ఆర్.పి.కి ఈ అరుదైన అవకాశం దక్కింది. కిరాక్ ఆర్.పి.కి ఈ మధ్యనే సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా హర్రర్ కామెడీ ఎంటర్ టెయినర్ గా వస్తున్న ఇదేం దెయ్యం సినిమాలో అతడు ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రుచికి కిరాక్ ఆర్.పి. ఓ ఘాటయిన లిప్ కిస్ ఇచ్చాడు. పాత్ర కామెడీతో కూడినదే అయినా ముద్దు మాత్రం సీరియస్ గానే పెట్టాడు. అయితే జబర్దస్త్ ఫేం తో ఏకంగా కొంతమంది ఇలా లిప్ లాకులు కూడా చేసే స్థాయికి వచ్చేస్తారా అంటూ ఈ లిప్ లాక్ తాలూకు ఫోటో చూసిన జనాలు కంగారుపడుతున్నారు. కాకపోతే అది నిజమైనా లిప్ లాకా లేక ఫేక్ లాకా అనేది ఈ ఫోటో చూసి చెప్పడం కష్టం.

చిన్మయానంద ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఇదేం దెయ్యం సినిమాకు వి.రవివర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రచ్చ రవి శ్రీకాంత్ మాగంటి సాక్షి కక్కర్ రచనా స్మిత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కొత్త ట్రెండ్ కు తెరతీసిన ఈ లిప్ కిస్ జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.