కిట్టు ఉన్నాడు జాగ్రత్త శాటిలైట్ రైట్స్

0Kittu-Gadu-Unnadu-Jagrathaవరుస హిట్లతో దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. గత ఏడాది మంచు విష్ణుతో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘ఈడో రకం-ఆడోరకం’ చేసి.. తనకు ఇండస్ట్రీలో బేషాజాలు లేవని.. కథ నచ్చితే ఏ హీరోతోనైనా స్క్రీన్ షేర్ చేసుకోగలనని నిరూపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనిని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా మార్చి మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే బిజినెస్ పూర్తయింది. ఓవర్సీస్ లో 57కు పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతోంది. ‘యు/ఎ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా.. రాజ్ తరుణ్ ఇంతకు ముందు నటించిన చిత్రాలకంటే.. రికార్డు స్థాయి రేటులో అమ్ముడు పోయిందట.

ప్రముఖ జెమినీ ఛానెల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రూ.3 కోట్లకు దక్కించుకుందనే టాక్ వినబడుతోంది. ఇది రాజ్ తరుణ్ చిత్రాల్లోకెల్లా హైయ్యస్ట్ అట. ఇప్పటికే ట్రైలర్స్ తో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ‘కిట్టుగాడు’ శాటిలైట్ రైట్స్ తో మరింత తన రేంజ్ ను పెంచుకోవడాన్ని బట్టి చూస్తే.. ఫ్యూచర్లో యంగ్ హీరోల్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయ్యే ఛాన్సులున్నాయని ఇండస్ట్రీలో టాక్. అన్నట్టు ఇందులో ఐటెం బాంబ్ హంసానందిని `నా పేరే సింగపూర్ సిరిమల్లి..` అనే ఓ ఐటెం సాంగు చేసింది. చాలా కాలం తరువాత కుర్రకారును ఉర్రూతలూగించేందుకు వస్తున్న హంసా.. ఏమాంత్రం హీటెక్కించిందో చూడాలంటే.. 3వ తేదీ వరకు ఆగాల్సిందే!