తెలుగు దర్శకుడి అరెస్టు..!

0


telugu-director-arrestedడబ్బుకు లోకం దాసోహం..అన్నారు పెద్దలు. ఈ మద్య డబ్బు కోసం ఏ పనిచేయడానికైనా సిద్దపడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం..ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వారికి లక్ ఉంటే స్వర్గం..లేదంటే నరకం. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన వారు లగ్జరీకి అలవాటు పడుతున్నారు.

ఇక వారి విలాసాల కోసం డబ్బు సంపాదించడానికి ఏంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. డబ్బుకోసం లగ్జరీ జీవితం గడపటానికి అక్రమంగా డబ్బు సంపాదించే పనిలో పడుతున్నారు..ఇందుకోసం తమ కొంతమంది నటీమణులు వ్యభిచారం చేస్తూ మీడియాకు, పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొంత మంది అక్రమంగా డబ్బు సంపాదించి సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

తాజాగా కేటుగాడు సినిమాకు దర్శకత్వం వహించిన కిట్టు అనే దర్శకుడి ని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. ఆ మద్య కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లని రద్దు చేసిన నేపథ్యంలో రద్దైన నోట్ల ని మారుస్తానంటూ బేరాలు కుదుర్చుకొని కోటి 20 లక్షల రూపాయలను తెప్పించాడు కిట్టు అనే దర్శకుడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనగర్ కాలనీ లోని కిట్టు ఆఫీసు పై పోలీసులు దాడి చేయగా డైరెక్టర్ కిట్టు తప్పించుకొని పారిపోయాడు.

చాలా కాలం తప్పించుకు తిరుగుతున్న కిట్లు ఖమ్మం జిల్లా చర్ల దగ్గర్లో ఉన్నాడని తెలుసుకొని పకడ్బందీగా వెళ్లి అరెస్ట్ చేసారు పోలీసులు . కేటుగాడు సినిమా చేసిన తర్వాత మళ్ళీ సినిమా చేయాలనీ ఫిక్స్ అయిన కిట్టు ఈ బిజినెస్ లోకి దిగాడు. అత్యాశకు పోయి పరువు పోగొట్టుకొని ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.