లాడెన్ ను చంపినా కత్తి రూ.19.5 లక్షలట!

0

ఓ కత్తిని వేలం వేస్తే రూ.19.5 లక్షలకు అమ్ముడుబోయింది. అంత వెలబెట్టి ఆ కత్తిని కొన్నారు… మరి ఆ కత్తేమైనా వజ్రాలు పొదిగిందా… లేదా బంగారంతో తయారు చేసిందా…? అని అనుకోకండి… ఆ కత్తికో చరిత్రుంది. అది ప్రముఖ అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్‌ను చంపడానికి ఉపయోగించింది.

అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడిలో అమెరికా సీల్‌ సభ్యుడు ఈ కత్తిని ఉపయోగించాడు. ఈ కత్తిని ఓ సంస్థ వేలానికి ఉంచింది. వేలంలో ఈ కత్తి రూ.19.5 లక్షలకు అమ్ముడుపోయింది. ఈ మొత్తం సొమ్మును మార్చిలో జరిగిన శిక్షణలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన మరో సీల్‌ సభ్యుడి కుటుంబానికి అందజేయనున్నారు.

 

Knife used  in Osama Bin Laden Mission:
Please Read Disclaimer