శ్రీరెడ్డి ఆరోపణలపై కోన రియాక్షన్

0నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు తనతో చనువుగా ఉన్న ఫొటోలను హీరోయిన్ శ్రీరెడ్డి బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో ఆమె మాట్లాడుతూ రచయిత కోన వెంకట్ పై సంచలన ఆరోపణలు చేసింది. కోన వెంకట్ తనను రేప్ చేశాడని ఆరోపించింది.

కాగా దీనిపై కోన ట్విట్టర్ లో స్పదించాడు. ‘నాతో సహా కొంతమంది సినీ ప్రముఖులపై ఓ నటి చేస్తున్న ఆరోపణలతో నేను షాక్‌కి గురయ్యాను. దీనిపై పోలీసులతో కూలంకషంగా, లోతుగా దర్యాప్తు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వాస్తవాలను వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. సత్యం జయించాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది చీప్ పబ్లిసిటీ కోసం సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. దీనిని నేను ఖండిస్తున్నాను’’ అంటూ కోన వెంకట్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.