పవన్ నా మనసులో లేడు

0భరత్ అనే నేను విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్న దర్శకుడు కొరటాల శివ చూపించినట్టుగా గత నాలుగేళ్లలో మహేష్ ని మాస్ మెప్పించేలా ఎవరు చూపించలేదు అన్నది నిజం. అందుకే మూడో సినిమాకైనా వెంటనే రెడీ అంటున్నాడు ప్రిన్స్. అది అంత ఈజీగా జరగదు కానీ సినిమా చూసాక మీడియాతో పాటు అభిమానులకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇది స్టార్ట్ కావడానికి ముందే కొరటాల పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించే ప్రయత్నం చేసాడని కాని పవన్ మూడ్ వేరుగా ఉండటంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ వద్దనుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీడియా అదే విషయాన్నీ ప్రస్తావించగా కొరటాల శివ దాన్ని పూర్తిగా కొట్టి పారేసాడు. అసలు పవన్ ను తాను కలవనేలేదని తన మనసులో ఈ కథకు సంబంధించి ఆయన లేడని క్లారిటీ ఇచ్చాడు.

అసలు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఒక స్టార్ హీరో అయితేనే దీనికి న్యాయం చేయగలడని భావించి మహేష్ అయితేనే పర్ఫెక్ట్ ఛాయస్ అని గుర్తించినట్టు చెప్పాడు. నిజమే. మహేష్ కు రాజకీయాలంటే ఆసక్తి లేదు కాని అసలు సంబంధాలే లేవని చెప్పలేం. ఎందుకంటే బావ గల్లా జయదేవ్ అధికార పార్టీ ఎంపి. నాన్న కృష్ణ మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. కాని ప్రిన్స్ మాత్రం మాటవరసకు కూడా పాలిటిక్స్ మాట్లాడేందుకు ఇష్టపడేవాడు కాదు కనక ఈ రోల్ అంత సహజంగా వచ్చింది అనుకోవచ్చు. అదే ప్లస్ పాయింట్ గా మారింది కూడా. ఒకవేళ శివ అన్నట్టు పవన్ కనక చేసుకుంటే సినిమా మొత్తం జననేత అధినేత సిఎం అయినట్టు కనిపిస్తుంది తప్ప మరోలా కాదు. అందుకే ఈ విషయంలో న్యూట్రల్ గా ఉండే మహేష్ కన్నా బెస్ట్ ఛాయస్ మరొకరు లేరే అనిపిస్తుంది.