కొరటాల రేటు పెరిగింది

0ఒక దర్శకుడు ప్రస్తుతం జస్ట్ యావరేజ్ సినిమా చేసినా అతనికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక పక్కాగా హిట్టు తీయగలడని ముద్ర వేసుకున్న దర్శకుడికి అయితే స్టార్ హీరోలు సైతం కాల్షీట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తాం అంటారు. అలాంటి దర్శకుల్లో రాజమౌలి తరువాత కొరటాల శివ స్థానం దక్కించుకున్నాడనే చెప్పాలి. భరత్ అనే నేను సినిమాతో ఇటీవల మహేష్ కెరీర్ ను కొరటాల ట్రాక్ తప్పకుండా సెట్ చేశాడు.

ఆ సినిమా హిట్ అయ్యింది గాని అనుకున్నంతగా రికార్డ్ లను ఏమి క్రియేట్ చేయలేదు. ఇకపోతే జనాల్లో మినిమామ్ హిట్టు తీసే దర్శకుడు అని గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి రామ్ చరణ్ మెగాస్టార్ కోసం ఒక కథను సెట్ చెసుకోమని గత కొన్ని నెలల క్రితమే చెప్పాడు. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతోందట. భరత్ అనే నేను సినిమా కంటే 25% ఎక్కువ అందుకొనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. అయితే చిరంజీవి కోసం నెక్స్ట్ కొరటాల స్క్రిప్ట్ ను పూర్తిగా ఫినిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే చెప్పిన కాన్సెప్ట్ కు చరణ్ మెగాస్టార్ ఫిదా అయిపోయారు. రీసెంట్ గా ఫారిన్ వెకేషన్ ను ఎంజాయ్ చేసి వచ్చిన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్టుగా కథను చిత్రీకరించాలని అనుకుంటున్నాడు. రామ్ చరణ్ అలాగే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. మరో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.