క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టిన క్రిష్??

0

జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్ క్రిష్ కు టాలెంటెడ్ ఫిలింమేకర్ అనే పేరు ఉంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలవడం.. ‘మణికర్ణిక’ సినిమా విషయంలో నెలకొన్న వివాదం క్రిష్ ఇమేజ్ ను దెబ్బతినేలా చేశాయన్నది కాదనలేని నిజం. హిట్లు ఫ్లాపులు అనేవి ఎవరికైనా తప్పవు కానీ క్రిష్ ను ‘మణికర్ణిక’ వివాదంలో కొందరితో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా పాస్ట్.. మరి ఫ్యూచర్ ఏంటి?

క్రిష్ తన నెక్స్ట్ సినిమాను బాలీవుడ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడట. బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కు ఈమధ్యే ఒక ఇంట్రెస్టింగ్ కథను వినిపించాడట. కథ నచ్చడంతో అక్షయ్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడట. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. గతంలో క్రిష్ అక్షయ్ కుమార్ తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తెరకెక్కించాడు. రీమేక్ సినిమా అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అది హిట్ గా నిలిచింది. సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ సారి కూడా అక్షయ్ కుమార్ ఓకే చెప్పడం దాదాపుగా ఖాయమేనని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే క్రిష్ త్వరలోనే ముంబైకి మకాం మారుస్తాడు.

మరి ఈ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయాలు.. ‘మణికర్ణిక’ వివాదాల చేదు అనుభవాల నుండి బైటపడి తన నెక్స్ట్ సినిమాను హిట్ గా మలిస్తే గానీ క్రిష్ కెరీర్ మళ్ళీ గాడిన పడే అవకాశం లేదు. మరి క్రిష్ ఏం చేస్తాడో వేచి చూడాలి.
Please Read Disclaimer