క్రిష్ దర్శకత్వంలో మెగాస్టార్!

0Krish-to-direct-chiranjeeviమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ప్రతిభ గల దర్శకుడు క్రిష్ కూడా ఓ కథతో చిరంజీవిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

మాకు అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ వివరించిన స్టోరీ లైన్ చిరంజీవిని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని చిరంజీవి క్రిష్ ని అడిగినట్లు తెలుస్తోంది. కాగా ఈకాంబినేషన్ ఇంకా చర్చల దశలోనే ఉన్నందున దీనిపై చిరంజీవి తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.

కాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర విజయంతో ఉత్సాహంగా ఉన్నాడు. చిరంజీవి – క్రిష్ ల కాంబినేషన్ కుదిరితే అది చాలా ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.