కృష్ణంరాజుకి శ్రీదేవి ఇచ్చిన మాట

0అతిలోక సుందరి శ్రీదేవికి సంతాప సభ ఏర్పాటు చేశారు టి.సుబ్బిరామిరెడ్డి .సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ నటులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు

ఈ సందర్భంగా సినియర్ హీరో కృష్ణమరాజు మాట్లాడుతూ.. పెద్దలంటే శ్రీదేవి చాలా గౌరవం. నటిగా కొన్ని పాత్రలు ఆమె తప్ప ఎవ్వరూ చేయలేరు. ఆమధ్య కలిసినప్పుడు ‘చిత్రసీమకొచ్చి నాకు యాభై ఏళ్లు. మీకూ యాభై ఏళ్లయ్యాయి. దీన్ని ఓ వేడుకగా జరుపుకోవాలి. ఆ కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తా’ అంది. కానీ ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన సమయంలో కన్నీటి వీడ్కోలు ఇవ్వాల్సిరావడం బాధాకరమైన విషయం”అని ఆయనఆవేదన వ్యక్తం చేశారు.