ఎన్టీఆర్ తో మూవీపై క్రియేటివ్ డైరెక్టర్ కామెంట్స్

0

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దశాబ్ద కాలంగా సక్సెస్ అనేది దక్కించుకోలేక పోతున్నాడు. 2009లో మహాత్మ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని దక్కించుకున్న కృష్ణవంశీ అప్పటి నుండి సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ లు దక్కక పోవడంతో సినిమాల సంఖ్య కూడా తగ్గించాడు. ఈ పదేళ్లలో ఈ క్రియేటివ్ డైరెక్టర్ కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. కృష్ణవంశీ చివరగా 2017లో నక్షత్రం చిత్రంతో వచ్చాడు. అంతకు ముందు గోవిందుడు అందరి వాడేలే చిత్రంతో వచ్చాడు. కృష్ణవంశీ సక్సెస్ లు లేకున్నా కూడా అతడిలో ట్యాలెంట్ ఉందని మాత్రం అంతా నమ్ముతారు. ఇప్పటికి కూడా క్రియేటివ్ డైరెక్టర్ గా పలువురి అభిమానంను దక్కించుకుంటున్న కృష్ణ వంశీ తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యాడు.

ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు కృష్ణ వంశీ సమాధానం ఇచ్చాడు. ‘చక్రం’ వంటి సినిమాను మరోసారి తీస్తారా అదో అద్బుతమైన ఎమోషనల్ సినిమా అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన లేదండి చక్రం మంచి సినిమా అయినా కూడా జనాలకు కనెక్ట్ కాలేదు – డబ్బులు రాలేదు. అయితే ఇప్పుడు టీవీల్లో వస్తూ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఆధరిస్తున్నారు అన్నాడు.

ఎన్టీఆర్ తో ఒక మంచి రొమాంటిక్ సినిమాను తీయ్యండి సర్ అంటూ ఒక అభిమాని ప్రశ్నించిన సమయంలో మీరు కోరుకున్నట్లుగా సినిమా తీసేందుకు యువ దర్శకులు చాలా మంది ఉన్నారు. రొమాంటిక్ సినిమాలు వారు చేస్తే బాగుంటాయి అన్నాడు. గతంలో ఎన్టీఆర్ తో కృష్ణవంశీ ‘రాఖీ’ అనే చిత్రంను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

తర్వాత సినిమాపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్న ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం దాటవేశాడు. తర్వాత సినిమా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. కాకుంటే నేను ఏది తీసినా చేసినా కూడా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను అందుకు చాలా ప్రయత్నిస్తాను అన్నాడు.
Please Read Disclaimer