స్నేహితుడికి ప్రకాశ్ రాజ్ చాన్సిస్తాడా?

0సింధూరం…నిన్నే పెళ్లాడుతా….అంతఃపురం….ఖడ్గం….చందమామ….ఇలా టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు కృష్ణవంశీ. ఈ దర్శకుడి సినిమాలో నటించాలని ఒకప్పుడు నటీనటులు ఉవ్విళ్లూరేవారు. సహజత్వానికి దగ్గరగా…పాత్రలు – కథలు ఎంచుకునే కృష్ణవంశీ…ఇపుడు దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇపుడు కృష్ణవంశీ సినిమాలో నటించేందుకు కొందరు నటీనటులు జంకుతున్నారంటే ఆయనకు ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే పరాజయాలకు కుంగిపోకుండా…తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం కృష్ణవంశీకి వచ్చింది. అందుకే తాజాగా ఓ రీమేక్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడట. ఆ రీమేక్ లో తనకు అత్యంత సన్నిహితుడు – మిత్రుడు అయిన ప్రకాశ్ రాజ్ ను లీడ్ రోల్ లో నటించాల్సిందిగా అడిగాడట.

ఈ మధ్య కాలంలో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన `గోవిందుడు అందరివాడేలే మినహాయించి మిగతావి డిజాస్టర్ అయ్యాయి. నక్షత్రం దెబ్బ నుంచి ఆయనతోపాటు ఆ చిత్రంలో నటించిన వారు కూడా కోలుకోలేదు. అందుకే గత వైభవం తిరిగి తెచ్చుకునేలా కృష్ణవంశీ…కొత్త కథల వేటలో పడ్డాడట. ఈ క్రమంలోనే `నట సామ్రాట్ ` అనే మరాఠీ సినిమా కృష్ణ వంశీని ఆకట్టుకుందట. మరాఠీ `నటసామ్రాట్ `లో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ నటించి మెప్పించాడ. దీంతో ప్రకాశ్ రాజ్ లీడ్ రోల్ లో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆ ప్రపోజల్ కు ప్రకాశ్ రాజ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందట. మరి కష్టాల్లో ఉన్న తన మిత్రుడికి ప్రకాశ్ రాజ్ స్నేహ హస్తమందిస్తాడో లేదో వేచి చూడాలి.