ఈ ఏడాదిలో ప్రభాస్ పెళ్లి: కృష్ణంరాజు

0Krishnam-raju-and-prabhasటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన స్టార్ హీరో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిన్న పుట్టినరోజు సందర్బంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించిన రెబర్ స్టార్ కృష్ణంరాజుగారు పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రభాస్ వివాహం ఖచ్చితంగా అయిపోతుందని, అమ్మాయి ఎవరనే విషయాన్ని ‘బాహుబలి 2’ చిత్రం విడుదల తర్వాత చెబుతానని అన్నారు.

అలాగే వివాహం బాహుబలి తర్వాత మొదలవ్వబోయే చిత్రం ప్రారంభానికి ముందే ఉండొచ్చని, ప్రభాస్ కు లైఫ్ లో ఎప్పుడు ఏం చేయాలో చెప్పక్కర్లేదని, తనకు తానే నిర్ణయించుకోగలడని కూడా అన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ జనాలు ప్రభాస్ వివాహం ఈ సంవత్సరం జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందనే నిర్ణయానికి వచ్చేశారు. ఇకపోతే ప్రభాస్ తన తరువాతి సినిమాను సుజీత్ డైరెక్షన్లో చేయనుండగా, కృష్ణం రాజు యొక్క గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్ పై కూడా ఒక సినిమాని ఒప్పుకున్నాడు.