కృష్ణార్జున యుద్ధం టాక్..

0వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని…ఈరోజు కృష్ణార్జున యుద్ధం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని ద్విపాత్రాభినయంలో నటించగా , మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఆడియో , ట్రైలర్స్ బాగుండడం తో సినిమా ఫై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలకు తగట్టే సినిమా ఉందా…లేదా అనేది చిత్ర టాక్ బట్టి తెలుసుకుందాం.

‘కృష్ణార్జున యుద్ధం’ ఫస్టాప్ పర్లేదు కానీ.. సెకండాఫ్ కాస్త బోర్ కొట్టించిందని ప్రేక్షకులు సోషల్ మీడియా లో కామెంట్స్ కురిపిస్తున్నారు. ఫస్టాప్‌లో కృష్ణ, అర్జున్‌గా రెండు విభిన్నపాత్రల్లో నాని తన స్థాయి నటనతో ఆకట్టుకున్నాడని, నాని స్టైల్ ఆప్.. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌టైన్ చేశాడని కానీ సెకండ్ హాఫ్ లో కూడా అదే రేంజి లో ఉంటె బాగుండు.

దర్శకుడు మేర్లపాక గాంధీ టేకింగ్ పరంగా ఓకే అనిపించినా కథను ఆసక్తిగా మలచడంలో తడబడ్డాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అనుపరమేశ్వరన్ చాల అందంగా ఉండడమే కాదు నటన పరంగా కూడా ఆకట్టుందని అంటున్నారు. మొత్తానికి కృష్ణార్జున యుద్ధం అనుకున్న రీతిలో అలరించలేకపోయిందని చెపుతున్నారు. ఇక పూర్తి రివ్యూ కోసం రీ ఫ్రెష్ చేస్తూనే ఉండండి.