పవన్ మాజీని పట్టించుకోలేదెవరూ

0పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన `తీన్ మార్` చిత్రంలో నటించింది కృతి కర్భంద. ఆ సినిమా పరాజయం ఈ అమ్మడికి నెగెటివ్ గా మారి – స్టార్ డమ్ దక్కకపోవడానికి కారణమైంది. అయితే పవన్ తన కరిష్మాతో – తనకు ఉన్న కాంటాక్ట్స్ తో పలు చిత్రాల్లో అవకాశాలిప్పించారన్న ప్రచారం అప్పట్లో సాగింది. అదంతా అటుంచితే – టాలీవుడ్ నుంచి కన్నడ రంగంలోకి – ముంబై పరిశ్రమకు వెళ్లి కృతి అదృష్టం పరీక్షించుకుంది. అయితే అక్కడా సోసోగానే ఆఫర్లు దక్కాయి.

ఆ క్రమంలోనే ముంబైలో కాస్ట్ లీ పార్టీల్లో కృతి సందడి ఫోటోల రూపంలో బయటపడింది. అంతర్జాలంలో ఈ భామ బాగా పాపులరైంది. లేటెస్టుగా ముంబైలో ఓ బర్త్ డే పార్టీకి వెళ్లిన తీన్ మార్ ఫేం కృతి కర్భందాను ముంబై మీడియా వెంటాడింది. ఆ వీడియోని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే రెండ్రోజుల్లో జీరో వ్యూస్ దక్కాయంటే ఈ భామ రేంజు ఎంతకు పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోని ఒక్కరు కూడా చూడలేదు.. ఇది చాలా దారుణం. కృతికి సినిమాలు లేవా? అంటే లేకపోవడమేం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. హౌస్ ఫుల్ 4 – కర్వాన్ – యమ్లా పాగ్లా దీవానా: ఫిర్ సే వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు కన్నడలో `రానా` అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి గుర్తింపు అన్నదే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సౌత్ లో తెలుగు – తమిళ్ లో అయితే అసలే కెరీర్ పరంగా జీరో అయిపోవడం ఈ భామకు పెద్ద మైనస్ గా మారిందని చెప్పొచ్చు.