ఆస్థిపంజరంతో రొమాన్స్ భలే ఉందే!

0కాదేది కవితకు అనర్హం అన్నారో మహాకవి. కాదేది ఐటెం సాంగ్ కు అనర్హం అంటున్నారు నవతరం దర్శకులు. మహేష్ బాబు సరసన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇంటెలిజెంట్ థ్రిల్లర్ 1 నేనొక్కడినే ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన కృతి సనన్ గుర్తుందిగా. హాట్ లుక్స్ తో సన్నని నాజూకు శరీరంతో యువతకు బాగానే చక్కిలిగిలి పెట్టింది. అది ప్లాప్ కావడంతో నాగ చైతన్యతో దోచేయ్ తో మరో ట్రయిల్ వేస్తే అదీ వర్క్ ఔట్ కాలేదు. లాభం లేదని బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న కృతి తాజా వీడియో సాంగ్ ఒకటి ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. స్త్రీ పేరుతో రూపొందుతున్న మల్టీ స్టారర్ లో కృతి సనన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ఆవో కభీ హవేలీ పే అంటూ సాగే ఆ పాట వెరైటీ థీమ్ తో ఉంది. పాడు బడిన పాత బంగళాలో అస్థిపంజరాలతో పాటు డాన్సర్ల తో కలిసి కృతి వేసిన స్టెప్స్ కి అందరు ఫిదా అయిపోతున్నారు. నడుముని వయ్యారంగా అటుఇటు తిప్పుతూ హొయలు పోతూ బాడీని స్ప్రింగ్ లా కదిలిస్తున్న కృతి మూమెంట్స్ కి కేవలం 2 రోజుల్లో 23 మిలియన్లు దాటేసి యు ట్యూబ్ ట్రెండింగ్ లో 6వ ప్లేస్ కొట్టేసింది.

ఇప్పుడు ఈ పాట పుణ్యమా అని స్త్రీ మీద హైప్ పెరుగుతోంది. ఇలా నడుముతో మేజిక్ చేయటం కేవలం కత్రినా కైఫ్ దీపికా పదుకునే లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమని ఇప్పుడు కృతి ఈ లిస్ట్ లో చేరిపోయిందని నెటిజెన్లు ప్రశంశల వర్థం కురిపిస్తున్నారు. కృతికి ఇదంతా బాగానే ఉంది కానీ పాపం హీరోయిన్ గానే సరైన బ్రేక్ దొరకడం లేదు. అవకాశాలకు మరీ కరువు లేకపోయినా బ్లాక్ బస్టర్ హిట్ పడటం లేదు. ఇప్పుడు తన ఆశలన్నీ హౌస్ ఫుల్ 4 మీదే ఉన్నాయి. మొదటి మూడు భాగాలూ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా అదే కోవలో తనకో పెద్ద బ్రేక్ అని ఆశిస్తోంది. ఇప్పుడీ ఐటెం సాంగ్ ద్వారా మరికొందరు దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డ కృతి సనన్ మళ్ళి సౌత్ వైపు వచ్చే ఉద్దేశం మాత్రం లేదట.