దిమ్మతిరిగే హొయలు

0


సెక్సీ హీరోయిన్ కృతి సనోన్ రాబ్తా సినిమా పై చాల ఆశలు పెట్టుకుంది. కాని కొన్ని విమర్శలు కొన్ని పుకారులు మధ్య రాబ్తా సినిమా ఘోర పరాజయం చూడవలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్ళీ తన కొత్త ఫోటో షూట్లుతో కొత్త సినిమాతో బిజీ అయ్యింది. తన అందానికి పదును పెట్టి తన అందమే తనకు ఆయుధంలా ఎలా మార్చుకుంటోందో చూడండి.

మిస్ టేకెన్ అనే డిజైన్ స్పొర్ట్స్ వేర్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది కృతి సనోన్. ఈ డిజైన్ టార్గెట్ ఇప్పటి యూత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంది అనే చెప్పాలి. దానికి తగ్గట్లు గానే కృతి కూడా తన బాడీని పూర్తి గా బిగువుగా తయారు చేసి ఇలా ట్రాక్ పాంట్లో వైట్ టి షర్ట్ లో స్పొర్ట్స్ పర్సన్ లా మరి ఒక ఫోజ్ ఇచ్చింది. మోడల్ గా ముందు పని చేయడంతో వచ్చిన అనుభవం తో ఫ్యాషన్ ఫోటో షూట్లలో ఇలా అథ్లెటిక్ లుక్కుతో అదరగొట్టేస్తోంది. ఇక్కడ నిలబడే తీరు చూస్తే వేసుకున్న బట్టలకు ప్రచారం చేస్తుందా లేక తన వర్క్ ఔట్ చేసిన బాడీ కి ప్రచారం చేస్తుందో తేల్చుకోవడం కష్టమే కదూ.

అందం తోనే నెట్టుకువస్తున్న ఈ సుందరి.. ఇప్పుడు ‘బరేలి కి బర్ఫీ’ అనే సినిమాతో తన నటనతో మెప్పించే పని లో ఉందట. ఫ్యాషన్ గౌన్ వేసుకున్న మోడ్రన్ డ్రెస్ వేసుకున్న ఇప్పుడు ఇలా స్పొర్ట్స్ లుక్ లో కనిపించిన కృతి సనోన్ అందం మాత్రం చాలామందిని ఆమెకు ఫ్యాన్స్ ను చేస్తోంది. చూద్దాం మున్ముందు ఈ సుందరి ఇంకెన్ని ఫీట్లు చేస్తుందో!!Kriti-Sanon-Photo-Shoot