ఫ్లాప్ సినిమాకి కోట్లు వసూలు

0krrish 3 chennai theatersబ్రాండ్‌ కు ఉన్న విలువ అదే. ఓ హిట్టు సినిమాకి సీక్వెల్ తీస్తే.. ఓపెనింగ్స్ అదిరిపోతాయ్‌. ‘క్రిష్ 3′ కి అక్షరాలా అదే జ‌రుగుతోంది. ఈ సినిమా తొలి రోజే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. అయినా స‌రే, క్రిష్ విన్యాసాలు చూడ్డానికి జ‌నం ఎగ‌బ‌డుతున్నారు. దానికితోడు దీపావ‌ళి సీజ‌న్‌. బాక్సాఫీసు ద‌గ్గర పెద్ద సినిమాలేం లేవు. వెర‌సి క్రిష్ కోట్లు దండుకొంది. తొలి రోజు ఈ సినిమా రూ. 25 కోట్లు సాధించిన‌ట్టు లెక్కగ‌ట్టారు మార్కెట్ నిపుణులు. అదో రికార్డ్‌. మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అదో రికార్డ్‌. అయితే సోమ‌వారం నుంచి వ‌సూళ్లు ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి క్రిష్ నిల‌దొక్కుకొంటాడా? త‌న పెట్టుబ‌డిని రాబ‌ట్టుకొంటాడా అనే విష‌యాలు తెలియాలంటే మ‌రో వారం రోజులైనా ఆగాల్సిందే.

Tags : ఫ్లాప్ సినిమాకి కోట్లు వసూలు, Krrish 3 3 Days Collections,Krrish 3 3rd Day Collections,Krrish 3 Second day Collections,Collections Of Krrish 3,Krrish 3 Box Office Collections,Krrish 3 Collections,Krrish 3 2nd Day Income,2nd Day Collections Of Krrish 3,Box Office Collections Of Krrish 3