నో ఎన్టీఆర్.. ఓన్లీ కెటిఆర్

02016లో పెళ్లి చూపులు సినిమాతో హిట్టు అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండవ సినిమా కోసం సమయం చాలా తీసుకున్నాడు. నిర్మాత సురేష్ బాబు సపోర్ట్ తో మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్న తరుణ్ ఇప్పుడు సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే పూర్తయ్యింది. ఇక నుంచి సినిమా ప్రమోషన్స్ పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ రోజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకకు మొదట జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తారని అంతా అనుకున్నారు. అందుకోసం ప్రొడక్షన్ టీమ్ ఏర్పాట్లను కూడా చేసింది. అయితే ఆయన సడన్ గా వేరే వర్క్ వల్ల రాలేకపోతున్నట్లు సురేష్ బాబుకు స్పెషల్ గా కాల్ చేసిచెప్పినట్లు టాక్. ఇక ప్రీ రిలీజ్ వేడుకకు రాలేకపోతున్నందు వల్ల ప్రీమియర్స్ కి అటెంట్ అవుతారని ఒక రూమర్ వస్తోంది. సినిమా బావుంది అని తారక్ నుంచి చిన్న ట్వీట్ వచ్చినా సినిమాకు క్రేజ్ పెరుగుతుంది.

ఇక తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈ నగరానికి ఏమైంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. పూర్తిగా కొత్త నటీనటుల తో తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ డ్రామా గా రానుంది. మరి తరుణ్ భాస్కర్ రెండవ సినిమాతో మరొక ట్రెండ్ సెట్ చేస్తాడో లేదో చూడాలి.