సమంతకు కేటీఆర్ కంగ్రాట్స్..

0Samantha-and-KTRటాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.

ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. వీరి ఎనిమిదేళ్ల ప్రేమబంధం శుక్రవారం పెళ్లితో మరింత బలపడింది. రెండు మతాలకు చెందిన వీరి వివాహం హిందూ, క్రిష్టియన్ మత సంప్రదాయాల్లో జరిపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా తొలుత గోవాలోని బీచ్ ఒడ్డున వున్న ఓ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రాత్రి 11గంటల 52 నిమిషాలకు వివాహం జరిగింది.