కూలీగా మారిన కేటీఆర్!

0KTR_0తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు.. మంత్రి కేటీఆర్ కూలీ అవతారమెత్తారు. ఓ ముఖ్యమంత్రి కొడుకై ఉంది.. కాబోయే ముఖ్యమంత్రి అన్న ప్రచారం ఉండీ కూడా.. కేటీఆర్ కు ఈ అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా? అయితే.. ఇది తెలుసుకోండి.

త్వరలోనే వరంగల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతోంది. దాని కోసం పార్టీ నేతలు కూలీ పని చేసి.. డబ్బులు పోగెయ్యాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు. కేటీఆర్ తో పాటు.. నేతలు కూడా ఇలా కూలీ అవతారమెత్తుతున్నారు. ఇందులో భాగంగానే.. సికింద్రాబాద్ సుచిత్ర ప్రాంతంలో.. కూలీగా మారిన కేటీఆర్.. ఐస్ క్రీమ్ అమ్మారు. జ్యూస్ కూడా అమ్మారు.

ఒక ఐస్ క్రీమ్ ను.. ఓ నాయకుడు 5 లక్షలు పెట్టి కొన్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే.. ప్లీనరీ కోసం కేటీఆర్ లాంటి వాళ్లు.. ఒకట్రెండు రోజులు.. మూడునాలుగు పూటలు కష్టపడితే సరిపోతుందేమో కదా.