పన్నెండేళ్ళ వరకూ పాల బాటిల్ వాడేదట!

0

ఎంత పెద్ద స్టార్లు అయినా.. సెలబ్రిటీలు అయినా వారికి కొన్ని చిన్నప్పటి సీక్రెట్స్ ఉంటాయి. కానీ వాటి గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. అయితే వారు అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ళు అయి ఉండాలి లేదా చిన్ననాటి స్నేహితులు అయి ఉండాలి. అందుకే సెలబ్రిటీలు కనుక ఇలాంటి వారితో కలిసి ఏదైనా షోకు హాజరయితే ఇక ఏదో ఒక రహస్యం బైటకు రాక తప్పదు. రీసెంట్ గా జాన్వి కపూర్ విషయంలో అదే జరిగింది.

శ్రీదేవికి జాన్వి.. ఖుషి ఇద్దరు కుమార్తెలనే సంగతి తెలిసిందే. జాన్వి ఆల్రెడీ ‘ధడక్’ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఖుషి త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈమధ్య ఇద్దరూ సిస్టర్స్ కలిసి నేహా ధూపియా చాట్ షోకు హాజరయ్యారు. ఈ షోలో అక్క జాన్వి గురించి చెల్లి ఖుషి రెండు సీక్రెట్స్ చెప్పేసింది. మొదటిది ఏంటంటే.. జాన్వి పన్నెండేళ్ళ వరకూ పాలపీక ఉండే బాటిల్ లో పాలు తాగేదట. ఇక రెండో సీక్రెట్ ఏంటంటే.. నిద్రలో తనకు ఏం కలలోస్తాయో కానీ జాన్వి సినిమా డైలాగులు చెప్తుందట. ఖుషి అయితే రెండు సీక్రెట్స్ చెప్పేసింది కానీ జాన్వి మాత్రం పాల పీక విషయం ఒప్పుకోలేదు. అదేం లేదని చెప్పింది. కానీ నిద్రలో సినిమా డైలాగులు చెప్పే విషయం నిజమేనని ఒప్పుకుంది.

ఇద్దరూ అక్కచెల్లెళ్ళలో జాన్వి కాస్త స్లోగానే ఉంది. ఖుషి మాత్రం అక్కకు డబల్ స్పీడ్ లో ఉంది. రెండు రోజుల క్రితం తన పచ్చబొట్ల గురించి వివరించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇప్పుడేమో అక్క పాలపీక సీక్రెట్ బైట పెట్టేసి షాక్ ఇచ్చింది. సిస్టర్స్ అన్న తర్వాత ఇలాంటి తేడాలు కామనే.. ఒకరు స్లో గా మరొకరు స్పీడ్ గా ఉండడం కూడా చాలా సాధారణమే. వీటి సంగతి పక్కన పెడితే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమట.
Please Read Disclaimer