బొజ్జగణపయ్య భక్తిలో మునిగిన నాగ్-నాని

0మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ మల్టిస్టారర్ ‘దేవదాస్’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. నాగార్జున – నాని మొదటిసారి కలిసి నటిస్తుండడంతో జస్ట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ‘దేవదాస్’ టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే చెట్టుకింద డాక్టర్ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా గణేష్ చతుర్ధి పండగను పురస్కరించుకొని ‘లక లక లకుమికర’ అంటూ బొజ్జగణపయ్య పై సాగే ఒక పండగ పాట ను విడుదల చేసింది దేవదాస్ టీమ్.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి – శ్రీకృష్ణ పాడారు. ఇక ఈమధ్య ఫేడ్ అయిపోయాడని అనుకున్న మణి శర్మ లిటరల్ గా అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ లిరిక్స్ ను మరో లెవెల్ కు ఎలివేట్ చేసేలా మాంచి ఎనర్జిటిక్ ట్యూన్ అందించాడు. ఇక రేపే వినాయక చవితి పండగ కాబట్టి ఈ పాట రిలీజ్ చేసిన టైమ్ అయితే అదిరిపోయింది. ఇక గణేష్ మండపాలలో ఈ పాట మోత మోగించడం ఖాయం.

ఇప్పటికే ‘చెట్టుకింద డాక్టర్’ పాట హిట్ అయింది. తాజాగా ఈ ‘లక లకు లకుమికరా’ పాట కూడా టార్గెట్ ను పర్ఫెక్ట్ గా రీచ్ అయినట్టే. ఇక నాగార్జున – నాని లు కలిసి ఈ మాస్ బీట్లకు డ్యాన్స్ వేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఓ లుక్కేయండి.. జైజై గణేశ.. జై గణేశ!