లక్ష్మి మంచును అమెరికాలో ప్రశ్నించారట!

0ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు నటి లక్ష్మి మంచు. ఇటీవల కాలంలో యూఎస్ ఫెడరల్ అథారిటీ వారు.. టాలీవుడ్ నటీమణులన్న విషయం తెలిస్తే.. ఎయిర్ పోర్టుల వద్ద ఆపి వారిని ప్రశ్నిస్తున్న వైనం తెలిసిందే. యూఎస్ లో అక్రమ సెక్స్ రాకెట్ బయటపడిన నేపథ్యంలో.. టాలీవుడ్ నటీమణులకు కొత్త కష్టం వచ్చి పడింది. అమెరికా ఎయిర్ పోర్టులలో సౌత్ ఇండియా నటీమణులు అన్న విషయం తెలిసిన వెంటనే.. వారి రాకకు సంబంధించిన ప్రశ్నల పరంపర ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన లక్ష్మీ మంచు.. తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పారు. అయితే.. ఇదేమీ కొత్త కాదని సెప్టెంబరు 11 దాడుల తర్వాత నుంచి విదేశీయుల విషయంలో అమెరికాకు వచ్చే వారికి సంబంధించిన వివరాల్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన ఉదంతాల నేపథ్యంలో కొందరు నటీమణుల్ని అమెరికా అధికారులు ఎయిర్ పోర్టుల్లో ప్రశ్నించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. తనను కూడా అమెరికాలో అధికారులు ఆపి.. ప్రశ్నించారన్నారు. తమనేకాదని.. పలువురిని ఆపుతుంటారన్నారు. ఏ విషయంలో అయినా తమకు అవగాహన లేకున్నా.. అర్థం కాకున్నా.. అనుమానం వచ్చినా.. ఆపుతారని అదేమీ కొత్త విషయం కాదన్నారు.

టాలీవుడ్కు పెద్ద తలకాయి లేకపోవటంతోనే తాజాగా వెలుగు చూస్తున్న సమస్యలకు కారణంగా చెప్పుకొచ్చారు. స్వర్గీయ దాసరి లాంటోళ్లు ఉంటే.. ఇప్పుడు వెలుగుచూసే ఇష్యూల్ని సెటిల్ చేసే వారని.. ఇప్పుడున్న వారంతా తమ దారిన తాము అన్నట్లుగా ఉండటం కూడా కారణమన్నారు. శ్రీరెడ్డి ఎపిసోడ్ తో సహా ఇటీవల టాలీవుడ్ కు సంబంధించి వస్తున్న వివాదాలు దాసరి లాంటోళ్లు ఒకళ్లు ఉంటే ఇప్పటి పరిస్థితి ఉండేది కాదన్నారు. నిజమే.. మంచు లక్ష్మి చెప్పే దానిలో వాస్తవం ఉందని చెప్పక తప్పదు.