రాజా మీరు కేక అంటున్న లాస్య

0raja-meeru-kekaటీవీ యాంకర్లు హీరోయిన్లుగా మారే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే హాట్ యాంకర్లు అనసూయ.. రష్మీ.. శ్రీముఖిలు సినిమాల్లో సత్తా చాటేస్తున్నారు. గతంలో కూడా ఇలా టీవీల నుంచి వచ్చి సినిమాలు చేసినా.. అవన్నీ కేరక్టర్ రోల్స్ మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్టుగా హీరోయిన్ గా రంగంలోకి దిగిపోతున్న యాంకర్ల జాబితాలోకి.. లాస్య కూడా వచ్చి చేరింది.

రష్మీ గౌతమ్ ని హీరోయిన్ గా మార్చిన గుంటూరు టాకీస్ నిర్మాతలు లాస్య ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రాజా మీరు కేక అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రానికి కృష్ణ కిషోర్ టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. ఓ పెయింటింగ్ కాంపిటీషన్ లో సీరియస్ గా పెయింటింగ్ వేస్తున్న లాస్య ఈ పోస్టర్ లో ప్రధానంగా కనిపిస్తుంది. వెనకాల ఆటోపై గబ్బర్ సింగ్ పోస్టర్ లో పవన్ ను చూపించడంతోనే.. మెగా ఫ్యాన్స్ కు వల విసురుతున్నారనే విషయం అర్ధమైపోతోంది.

రేవంత్.. నోయెల్.. మిర్చి హేమంత్ లు రాజా మీరు కేక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఈ మూవీలో లాస్య యాక్టింగ్ అదిరిపోతుందని.. రాజా మీరు కేక రిలీజ్ అయ్యాక లాస్యకు బోలెడన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు నిర్మాత రాజ్ కుమార్.