ఎన్టీఆర్ లవ టీజర్ ఎప్పుడంటే!

0NTR-as-Lava-kumarతారక్ నటిస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం నుండి రాబోతున్న రెండవ టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలో ఒకటైన ‘లవ’ కు సంబందించి ఈ టీజర్ ఉండనుంది. మొదట నెగెటివ్ షేడ్స్ కలిగిన ‘జై’ పాత్ర తాలూకు టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ రెండవ పాత్ర తత్త్వం ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే రెండు పాటలు మినహా మిగతా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన టీమ్ ఈ టీజర్ ను కూడా ఈ నెల 25 వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. అదే విధంగా మూడవ పాత్ర ‘కుశ’ కు సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా ఈ నెలాఖరునే విడుదలచేస్తామని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు.