లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలని అభిమాని ట్వీట్

0lavanya-thripathi-to-be-arrప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని అరెస్ట్‌ చేయాలని వరుణ్‌ రెడ్డి అనే ఓ అభిమాని లావణ్యను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లావణ్య ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా లావణ్య పసుపు రంగు గౌనులో ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను వరుణ్‌ అనే నెటిజన్‌ లావణ్యకు ట్యా్గ్‌ చేస్తూ..‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అని ట్వీట్లో పేర్కొ్న్నాడు.

దీనికి వెంటనే లావణ్య రిప్లై ఇస్తూ..‘హా హా..మా నాన్న లాయర్‌’ అని పేర్కొంది. దాంతో ఈ ఫొటో, లావణ్య రిప్లై సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లావణ్య నటిస్తున్న ‘ఇంటిలిజెంట్‌’ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తు్న్నారు. ఇందులో లావణ్య సాయి ధరమ్‌ తేజ్‌కు జోడీగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఆశిష్‌ విద్యార్థి, సయాజీ షిండే, రాహుల్‌ దేవ్‌, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.