జిందగిలో బికినీ సీన్ తీసేశారా?

0Lavanya-Tripathi-Bikini-Sceneఈ రోజుల్లో హీరోలు స్టార్స్ గా ఎదగాలంటే చాలా కష్టపడాలి. సినిమా సినిమాకు లుక్స్ మార్చుతూ ప్రేక్షకులను మెప్పిస్తేనే హిట్స్ అందుకోగలరు. ఇప్పుడు అదే తరహాలో హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. కాకపోతే వీళ్లు అందంలో చాలా అప్ గ్రేడ్ అవుతున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో హీరోయిన్స్ ఒక సినిమాలో కనిపించినట్టుగా మరొక సినిమాలో కనిపించడం లేదు. సినిమా సినిమాకు వారి అందాల డోస్ ని బాగానే పెంచేస్తున్నారు.

ఇప్పుడు ఇదే తరహాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రయత్నాలు చేస్తాను అంటోంది. మొన్నటి వరకు పద్దతిగా చుడిదార్ అలాగే చీరల్లో కనిపించి బోర్ కొట్టేసిందని ఇక నుంచి ఘాటైన గ్లామర్ డ్రెస్సులను ఎక్కువగా వేయనున్నట్లు చెప్పుకొచ్చింది. అంతే కాకుండా అమ్మడు ఏకంగా బికినీ వేయడానికి కూడా రెడీ అంటోంది. సాధారణంగా అమాయకపు చూపులతో కనిపించే లావణ్య బికినీల్లో ఎలా ఉంటుందా అని అందరు అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక రూమర్ చెక్కర్లు కొడుతోంది. నిజానికి ఉన్నది ఒకటే జిందగీ సినిమా కోసం అమ్మడు బికినీలో మెరిసిందట. కాని అక్కడ సినిమా కంటెంట్లో ఉన్న ప్రేమకథకి.. ఈ కమర్షియల్ గ్లామర్ కి పొంతన లేకపోవడంతో .. ఈ బికినీ సీన్ ఎందుకులే అని ఎడిటింగ్ దగ్గరే తీసేశారని టాక్. . మేబీ.. లావణ్య అందుకు కూడా డిజప్పాయింట్ అయ్యుండొచ్చేమో.

ఇకపోతే లావణ్య ఈ మధ్యనే మిస్టర్ అండ్ యుద్ధం శరణం సినిమాలతో ఘోర పరాజయాలను అందుకుంది.అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ ని పెంచిందట. చూద్దాం మరి.. బికినీ సీన్ లేని ఈ సినిమా ఆమెకు ఎంతవరకు సక్సెస్ ను ఇస్తుందో.