సెక్సీ పోజులో లావణ్య త్రిపాఠి

0Lavanya Tripati In Radha Movieలావణ్య త్రిపాఠి పేరెత్తగానే ఒక ట్రెడిషనల్ లుక్ కళ్ల ముందు కదులుతుంది. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ నుంచి ఆమె చాలా వరకు పద్ధతిగానే కనిపిస్తుండటమే ఇందుకు కారణం. ఆమె అందంగా కనిపిస్తుంది కానీ.. ఎప్పుడూ అంత సెక్సీగా కనిపించింది లేదు. ఐతే శర్వానంద్ కు జోడీగా నటిస్తున్న ‘రాధ’లో మాత్రం లావణ్య రూటు మార్చినట్లే కనిపిస్తోంది. ఈ చిత్ర టీజర్లో లావణ్యను చూస్తే కుర్రాళ్ల మతులు పోయే ఉంటాయి. టీజర్లో ఆమె కనిపించింది ఒకట్రెండు క్షణాలే కానీ.. అంత తక్కువ సమయంలోనూ బలమైన ముద్రే వేసింది లావణ్య.

ఆమె వలువలేమీ విడిచేయలేదు కానీ.. చాలా సెక్సీగా దర్శనమిచ్చింది. గత సినిమాల కంటే గ్లామర్ డోస్ అయితే పెంచిందని లావణ్య పరుగులో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా పోస్టర్లలో కూడా లావణ్య చాలా అందంగా ఉంది. కెరీర్ ఆరంభం నుంచి లావణ్యకు అవకాశాలకైతే కొదవ లేదు కానీ.. ఆమె ఒక స్థాయిని మించి ఎదగలేకపోతోంది. ఈ రోజుల్లో ప్రతి సినిమాలోనూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఉంటే రేంజ్ అలాగే ఉంటుంది మరి. తర్వాతి దశకు చేరాలంటే కొంచెం గ్లామర్ డోస్ పెంచి తీరాల్సిందే. ‘రాధ’ లావణ్యకు ఆ దిశగా టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి. శర్వాతో ఆమెకు జోడీ బాగా కుదిరింది. ఈ సినిమా మీద కూడా పాజిటివ్ బజ్ ఉంది. మరి ఈ చిత్రం లావణ్యకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.